TTD : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్

TTD : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్
X

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లను ఏప్రిల్ 24న రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లను ఏప్రిల్ 23 మ.3 గంటలకు విడుదల చేస్తామని పేర్కొంది. ఇక తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు ఏప్రిల్ 23న ఉ.10 గంటలకు అందుబాటులో ఉండనున్నాయి.

తిరుమల శ్రీవారి సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతుంది. 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతోంది. ఇక అటు నిన్న తిరుమల శ్రీవారిని 73,543 మంది భక్తులు..దర్శించుకున్నారు. 21,346 మంది భక్తులు.. నిన్న తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.22 కోట్లుగా నమోదు అయింది.

Tags

Next Story