TTD : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్

తిరుమల శ్రీవారి అక్టోబర్ నెలకు సంబంధించిన సేవా టోకెన్లు ఇవాళ విడుదల కానున్నాయి. ఉ.10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, ఉ.11కి శ్రీవాణి ట్రస్టు టికెట్లు, మ.3కి వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 17 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న 71,939 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
జులై 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తుంది టీటీడీ. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అక్టోబరు నెలకు సంబంధించిన కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. జులై 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com