Srisailam : శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

Srisailam : శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు
X

మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శివ దీక్షాపరులకు ఈ నెల 19 నుంచి 23 వరకు సర్వదర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 23న శ్రీశైలం క్షేత్రానికి రానున్నారు. మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం పట్టువస్త్రాలు అందజేస్తారు. ఇదిలా ఉండగా ఎన్నడూ లేని విధంగా సీఎం నేరుగా హాజరై స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తుండటం విశేషం. గతంలో ప్రభుత్వం తరుపున ఎవరైనా మంత్రులు వచ్చి పట్టువస్త్రాలు స్వామి వారికి సమర్పించేవారు. శ్రీశైలానికి సీఎం చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో జిల్లా యంత్రాంగంతో పాటు ఆలయ అధికారులు కూడా తగిన ఏర్పాట్లుకు సిద్ధమయ్యారు.

Tags

Next Story