Bathukamma Festival : మన బతకమ్మకు అమెరికాలో అధికారిక గుర్తింపు

Bathukamma Festival : మన బతకమ్మకు అమెరికాలో అధికారిక గుర్తింపు
X

తెలంగాణ పూల పండగ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. బతుకమ్మ సంబుర ప్రాశస్త్యాన్ని, పండగలోని పరమా ర్థాన్ని అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తించా యి. జార్జియా, వర్జీనియా రాష్ట్రాలతోపాటు ఉత్తర కరోలినా రాష్ట్రంలోని చార్లెట్, రాలేహ్ సిటీలు బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఇక నుంచి ఆయా రాష్ట్రాల్లో ఈ ఉత్సవాన్ని అందరూ కలిసి సమిష్టిగా నిర్వహించుకోవాలని డెసిషన్ తీసుకోవడం విశేషం. ది ఫెస్టివల్ ఆఫ్ లైఫ్ ఆధారంగా 9 రోజులుగా జరిగే ఈ వేడుక తెలుగువారి సంస్కృతి, సాంపద్రాయాలకు అద్దం పడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఈ వారాన్ని బతుకమ్మ పండుగ, తెలంగాణ హెరిటేజ్ వీక్ గా ప్రకటించారు. బతుకమ్మ ఎంతో ప్రత్యేక మైన, ప్రాముఖ్యతగల పండుగల్లో ఒకటని.. ఈ ఉత్సవాన్ని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలే కాకుండా అమెరికాలో స్థిరపడ్డ 12 లక్షల మంది ఎన్నారైలు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని జార్జియా, వర్జీనియా రాష్ట్రాల గవర్నర్లతోపాటు ఉత్తర కరోలినాలో ని చార్లెట్, రాలేహ్ మేయర్లలు అభివర్ణించా రు. ఈ ఉత్సవాన్ని అందరూ కలిసి సమిష్టిగా నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో వారికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.

Tags

Next Story