Bhadradri Ram Temple : పెరిగిన భద్రాద్రి రాముడి హుండీ ఆదాయం

Bhadradri Ram Temple : పెరిగిన భద్రాద్రి రాముడి హుండీ ఆదాయం
X

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. మొత్తం 38 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించగా 1.13 కోట్ల ఆదాయం వచ్చింది. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెప్పోత్సవం, ఉత్తర ద్వారదర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆదాయం పెరిగింది. హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. హుండీల ద్వారా 298 US డాలర్లు, 155 సింగపూర్‌ డాలర్లు తో పాటు పలు భారీగా విదేశీ కరెన్సీ లభించిందని ఆలయ ఈఓ తెలిపారు.

Tags

Next Story