Indrakeeladri : ఇంద్రకీలాద్రిలో నేటి నుంచి భవానీ దీక్షల విరమణ

Indrakeeladri : ఇంద్రకీలాద్రిలో నేటి నుంచి భవానీ దీక్షల విరమణ
X

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు జరగనున్నాయి. భక్తులు ఏ క్యూలోనైనా ఫ్రీ దర్శనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతరాలయ ప్రవేశం ఉండదని, ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు. ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ వివరాలను ప్లే స్టోర్‌లోని ‘భవానీ దీక్ష 2024’ యాప్‌లో చూసుకోవచ్చు. రోజుకు సుమారు లక్ష మంది చొప్పున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. తొలి రోజున అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, అలంకరణ ఇచ్చిన తరువాత ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రెండో రోజు నుంచి వేకువ జామున 3 నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు

Tags

Next Story