TTD : సామాన్యులకే పెద్దపీట.. టీటీడీ గొప్ప నిర్ణయం

కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన హయాంలో టీటీడీ అద్భుతంగా సేవలు అందిస్తోంది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ అదిరిపోయేలా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు బిఆర్ నాయుడు గారు. తాజాగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల విషయంలో బిఆర్ నాయుడు తన ఉదారత చాటుకున్నారు. సామాన్యులకే పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మొదటి మూడు రోజులు ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి దర్శనం ఉంటుంది. మిగతా ఏడు రోజులు మాత్రం సామాన్యులకు టోకెన్లు లేకుండానే దర్శనం కల్పిస్తామన్నారు బిఆర్ నాయుడు. 182 గంటల్లో 164 గంటలు సామాన్యులకే కేటాయించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు ఉండే ఈ వైకుంఠ ద్వార దర్శనాల్లో.. జనవరి 2 నుంచి 8 వరకు అన్ని రకాల విఐపి దర్శనాలను రద్దు చేశారు. చంటి పిల్లల దర్శనాలు, బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి టిక్కెట్లు అన్నింటినీ రద్దు చేస్తూ కేవలం సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
వైసిపి హయాంలో మనం ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడైనా చూసామా. కేవలం వైసీపీ నేతలకు మాత్రమే టీటీడీలో అప్పుడు పెద్దపీట వేశారు. వైసీపీలో ఏ నియోజకవర్గస్థాయి నేత వచ్చినా సరే.. సామాన్యుల దర్శనాలను ఆపేయడం కనిపించేది. భక్తులకు కనీస సౌకర్యాలు అనేవి అసలే లేవు. భక్తుల ఇబ్బందులను పట్టించుకున్న నాథుడే లేడు. ఇక సామాన్యులకు పెద్దపీట అనేది కల అనే చెప్పుకోవాల్సి వచ్చింది వైసీపీ హయాంలో. కానీ ఇప్పుడు బి.ఆర్ నాయుడు గారు ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం పట్ల శ్రీవారి భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి భక్తులకు ఎంత గొప్పగా ఏర్పాట్లు చేస్తున్నారు స్వయంగా వైసిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పటం అతిపెద్ద ఉదాహరణ.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

