Tirumala : శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు వీళ్లే!

Tirumala : శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు వీళ్లే!
X

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో సినీ నిర్మాత సునీల్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ శ్రీధర్ లు కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల శ్రీధర్ మాట్లాడుతూ… తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీవారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అయితే అది మాకు దీపావళి పండుగని… హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారిని డ్రమ్స్ శివమణి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల శివమణి మాట్లాడుతూ… ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తమన్ తో ఓ సినిమా చేస్తున్నానని… త్వరలోనే ఆ సినిమా కానుందని అన్నారు.

Tags

Next Story