TTD : తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్ర సీరియస్

తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఏఆర్ డెయిరీకి నోటీసులు పంపుతూ నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ వివాదంపై వివరణ ఇవ్వాలంటూ ఏఆర్ డెయిరీకి ఎఫ్‌ఎస్ఎస్ఐ నోటీసులు జారీ చేసింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను సేకరించిన కేంద్రం.. నాణ్యత పరీక్షలో ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి చెందిన నెయ్యి విఫలమైనట్లు వెల్లడించింది. ఈ మేరకు గత శుక్రవారం నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తిరుమల లడ్డూ తయారీలో తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ నెయ్యిని సరఫరా చేసింది. అయితే ఈ నెయ్యిలో జంతువుల నూనె కలిసిందన్న ఆరోపణలతో ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వమే చర్యలను ప్రారంభించింది. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి నోటీసులు పంపడంతో లడ్డూ వివాదం మలుపు మరింత తిరిగే అవకాశముంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com