Jharkhand : జార్ఖండ్ జ్యోతిర్లింగం గర్భగుడిలో రెచ్చిపోయిన ప్రధాన అర్చకులు

జార్ఖండ్‌లో ప్రసిద్ధి చెందిన బాబా బలక్నాథ్ జ్యోతిర్లింగం వేదికగా గర్భగుడిలో ప్రధాన అర్చకులు రెచ్చిపోయారు. ఆలయానికి వచ్చిన భక్తులతో అర్చకులు వింతగా ప్రవర్తించి వారి దగ్గర నుంచి 500 రూపాయలు డిమాండ్ చేశారు. 500 రూపాయలు ఇచ్చిన వాళ్లే గర్భగుడిలో ఉండాలి మిగితా వాళ్ళు బయటకు వెళ్లి పోవాలని పలువురు పూజారులు దాదాగిరి చేస్తున్నారు. 50 ,100 రూపాయలు బాబా తీసుకోడు అంటూ వింత వింత మాటలు మాట్లాడారు పలువురు పూజారులు. ఇవే కాకుండా భక్తులను నిలువు దోపిడీ చేస్తూ..పలువురు దొంగ బాబాలు ఇష్టానుసారంగా ప్రైవేట్ ముఠాలు గుడిని నడుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు అడగడమే కాకుండా.. జేబులపై చేతులు వేసి మరి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న జార్ఖండ్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com