TTD : కల్తీ నెయ్యి పాపం.. హిందూ సంఘాల మౌనం దేనికి..?

TTD : కల్తీ నెయ్యి పాపం.. హిందూ సంఘాల మౌనం దేనికి..?
X

తిరుమల తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి జరిగింది అంటేనే అంతకుమించిన మహా పాపం ఇంకొకటి ఉండదు. మన దేవుడిని ఒక్క మాట అంటేనే మనం తట్టుకోలేము కదా. రాజమౌళి అంతటి వ్యక్తి హనుమంతుడు మీద తనకు నమ్మకం లేదని ఒక మాట అంటేనే యావత్ హిందూ లోకం మొత్తం తీవ్రంగా విమర్శలు గుప్పిస్తుంది. హిందూ సంఘాలు వరుసగా కేసులు పెడుతున్నాయి. రాజమౌళి సినిమాలను హిందువులు బ్యాన్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు వస్తున్నాయి. ఇన్నేళ్లు దర్శకధీరుడు అంటూ ప్రశంసలు అందుకున్న వ్యక్తి మీద ఇంతటి వ్యతిరేకత కనిపిస్తుంది. రాజమౌళి ఒక మాట అంటేనే ఈ స్థాయిలో ఆయన్ను విమర్శిస్తున్నారు.

అయితే కల్తీ నెయ్యి కేసులో సిబిఐ సంచలన విషయాన్ని బయటపెట్టింది. అసలు లడ్డు తయారీ కోసం నెయ్యి వాడలేదని.. నెయ్యి లాంటి కెమికల్ తీసుకొచ్చి లడ్డూల్లో కలిపేసి హిందూ భక్తులతో తినిపించారని తేల్చేసింది. ఒక్క చుక్క పాలు వెన్న లేకుండా ఫ్యాక్టరీల్లో వాడే కెమికల్ పదార్థాన్ని తెచ్చి కోట్లాదిమంది హిందువులు పవిత్రంగా భావించే లడ్డూలో కలిపేయడం అంటే అంతకుమించిన మహా పాపం ఇంకొకటి ఉండదు కదా. ఇదంతా వైసీపీ ప్రభుత్వంలో, వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న టైంలోనే జరిగిందని అందరికీ తెలిసిపోయింది.

అయినా సరే వారి మీద ను సంఘాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి. వారిని ఎందుకు విమర్శించట్లేదు. రాజమౌళిపై లేచిన నోర్లు వైసిపి, వైవి సుబ్బారెడ్డి విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నాయి అనేదే ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహం. రాజమౌళి కంటే వీళ్ళు చేసింది మహా పెద్ద పాపం. ఒక మాట అన్న రాజమౌళిని ఆ స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటే.. ఇంత పెద్ద పాపం చేసిన వీళ్లను ఎందుకు ఏమీ అనలేకపోతున్నారు. వీళ్లకు ఏ శిక్ష వేసినా తప్పులేదు అని హిందువులు అంటున్నారు. కానీ హిందూ సంఘాలు ఈ విషయంలో బయటకు వచ్చి మాట్లాడాలని అంతా కోరుతున్నారు.

Tags

Next Story