Sabarimala : శబరిమలలో భక్తుల రద్దీ.. పంబ నుంచి సన్నిధానం వరకు క్యూ
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కేరళ వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ భారీగా రద్దీ నెలకొంది. పంబ నుంచి సన్నిధానం వరకు వేచి ఉన్నారు భక్తులు. అయితే సరైన సౌకర్యాలు కల్పించడంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం, కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యాయని.. అయ్యప్ప భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నా.. కనీసం తాగునీరు లాంటి మౌలిక వసతులు కల్పించడం లేదని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయ్యప్ప దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో..6 గంటలకుపైగా క్యూలైన్లలోనే పడిగాపులు కాస్తున్నారు. శబరిమలలో నెల దర్శనం, నక్షత్ర దర్శనాల కోసం అయ్యప్ప భక్తులు ముందుగా టికెట్లు బుక్ చేసుకుని.. భారీగా తరలివచ్చారు. అయితే భారీగా వచ్చిన భక్తులతో రద్దీ నెలకొనడంతో 6 గంటలకుపైగా క్యూలైన్లలోనే పడిగాపులు కాస్తున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులను అధికారులు అనుమతించకపోవడంతో క్యూలైన్లలోనే తోపులాటలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com