Tirumala : తిరుమలలో భక్తులు రద్దీ…. 18 గంటల సమయం

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం భారీ స్థాయిలో భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ప్రారంభం కానున్న తరుణంలో…. ఇప్పటికే ఇంటర్ ఫలితాలు రావడం… 10 తరగతి పరీక్షలు పూర్తి కావడంతో భక్తులు శ్రీవారి దర్శనార్థం క్యూకట్టారు. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది.సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం., విష్ణు నివాసంలో ఎస్ఎస్డి టైం స్లాట్ టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. ఇక శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం 5 వేల టోకెన్స్ జారీ చేస్తుంది. ఇక అలిపిరి మెట్ల మార్గం, రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకొనే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం లో టైం స్లాట్ టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. రోజుకు సుమారు 25 వేల టికెట్లు జారీ చేస్తుంది టీటీడీ. ఈ రద్దీ మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు టీటీడీ అధికారులు. క్యూలైన్ లో వేచిఉన్న భక్తుల కోసం నిత్యం అన్నపానీయాలు పంపిణీ చేస్తుంది టీటీడీ. ఇక తిరుపతిలోని అలిపిరి వద్ద వాహనాలు బారులుతీరాయి. వారాంతం కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడు విగ్రహం వరకు వాహనాలు బారులుతీరాయి. ఒక్కో వాహాన్ని క్షణంగా తనిఖీ చేయడానికి నిమిషానికి పైగా సమయం పడుతుంది. బ్యాగులు, ఇతర వస్తువులను అత్యాధునిక స్కానింగ్ మిషన్ ద్వారా తనిఖీ నిర్వహిస్తారు. తనికి అనంతరం సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద టిటిడి సెక్యూరిటీ వాహనదారులకు ఘాట్ రోడ్డులో వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచనలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com