TTD : జనవరిలో వైకుంఠ ద్వారా దర్శనం.. ఆ సేవలు రద్దు

TTD : జనవరిలో వైకుంఠ ద్వారా దర్శనం.. ఆ సేవలు రద్దు
X

వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలతో పాటు చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలకు మాత్రం అనుమతివ్వనున్నారు.

శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్‌ పొందినవారికి ప్రతి సేవకు భక్తులను మార్పు చేసుకునే అవకాశం లేదని టీటీడీ ధర్మకర్తల మండలి స్పష్టం చేసింది. గతంలో వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలోని పాలకమండలి భక్తుల మార్పునకు అవకాశమిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ అప్పట్లో వచ్చిన వ్యతిరేకత వల్ల దీని అమలు సాధ్యం కాలేదు.

Tags

Next Story