Kumbh Mela : కుంభమేళాకు పోటెత్తిన భక్తులు.. 8 రోజుల్లో 9 కోట్ల మంది రాక

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ అంటే.... ఎనిమిది రోజుల్లో దాదాపు 9 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
మహా కుంభమేళా.. పవిత్ర స్నానాలు, పిండ ప్రదానాలు ఇలా ఆధ్యాత్మిక శోభకు పుట్టిల్లు...ఇప్పుడు అది కాస్తా మరో ఆసక్తికర చర్చకు తెర తీసింది. కుంభమేళాలో బ్యూటీ హంటింగ్స్ మొదలయ్యాయి.. మొన్నటికి మొన్న ఇండోర్ కు చెందిన ఓ మహిళ....పూసలు అమ్ముతూ అందర్నీ ఆకట్టుకుంది. ఆ యువతి అందం సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇండోర్ మోనాలిసా అంటూ పేరు పెట్టేసి...తెగ రచ్చ చేసేశారు. చివరకు సినిమా అవకాశాలు అంటూ ఎవరికి తోచింది వాళ్లు కథలు అల్లేశారు. ఇండోర్ మోనాలిసా తర్వాత...ఇప్పుడు మరో యువతి ఫొటో వైరల్ అయ్యింది.. ఆ యువతి కూడా ఇండోర్ నుంచే వచ్చింది. ఈ యువతి పేరు మీనా...మొన్న మోనాలిసా.. ఇప్పుడు మీనా.....కుంభమేళాలో వీళ్లతో సెల్ఫీలు తీసుకోవటానికే కుర్రోళ్లు ఎగబడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com