Kumbh Mela : కుంభామేళాకు పోటెత్తనున్న భక్తులు.. అధికారుల కీలక నిర్ణయం

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్ మొత్తం నో వెహికల్ జోన్‌గా మారుస్తామని తెలిపారు. కాగా కుంభమేళాలో రోజూ దాదాపు 1.44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నట్లు అధికారుల అంచనా.
ఈ నెల 12న మాఘపౌర్ణమి రానుంది. మాఘ పౌర్ణమినాడు శ్రీ మహావిష్ణువు స్వయంగా గంగలో నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు పుణ్య నదులు, సముద్రంలో తలస్నానం ఆచరించాలి. సూర్య భగవానుడు, గంగా నదిని స్మరిస్తూ తర్పణాలు వదిలితే పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని ప్రతీతి. నువ్వులు, రేగి పండ్లు, అన్నదానం చేయాలి. ఆరోజు చేసే హోమాలకు, సత్యనారాయణస్వామి వ్రతానికి కోటి రెట్ల పుణ్య ఫలం లభిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com