Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 62,593 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,517 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమలలో శ్రీవారం హుండీ ఆదాయం రూ.4.31 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
తిరుమలలో ఫిబ్రవరి 11న 7వ విడత అయోధ్యకాండఅఖండ పారాయణం నిర్వహిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు జరిగే కార్యక్రమంలో అయోధ్యకాండలోని 22 నుంచి 25వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 155 శ్లోకాలు, యోగవాశిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 180 శ్లోకాలను పారాయణం చేస్తారని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com