TTD : గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వకండి : టీటీడీ

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు సెప్టెంబర్ 27న తిరుమలకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు ఈ మేరకు వినతి చేస్తున్నది. మరోవైపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీకి మల్టీ పర్పస్ క్లీనింగ్ కు ఉపయోగించే రూ.20 లక్షలు విలువైన రోస్సరి ప్రోఫెషనల్ కంపెనీకి చెందిన రాస్ స్ట్రీట్ ఆర్ఓ 1500 రైడ్ ఆన్ స్వీపర్ మెషిన్ ను ఆదివారం సాయంత్రం విరాళంగా అందించింది. శ్రీవారి ఆలయం ముందు అదనపు ఈవో వెంకయ్య చౌదరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి జీఎం పత్రి శ్రీనివాస్ ఈ మెషిన్ ను అందజేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com