TTD : టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

మంగళగిరికి చెందిన శ్రీ మన్యం శ్రీనివాసరావు అనే భక్తుడు సోమవారం తన కుమార్తె మన్యం హారిక పేరు మీదుగా టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116, మరో కుమార్తె మన్యం హరిత పేరు మీదుగా ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి జానకిదేవి పాల్గొన్నారు. మరోవైపు బెంగుళూరుకు చెందిన టివోల్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.15,94,962 విలువైన మొంట్రా ఎలక్ట్రిక్ ఏవియేటర్ (e-SCV) వాహనాన్ని సోమవారం టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com