Ganesh Immersion : డ్రోన్ తో గణేష్ నిమజ్జనం

పెరిగిన టెక్నాలజీని యూత్ ఒడిసి పట్టుకుంటున్నారు. జిల్లాల్లోనూ ఈ టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలకు ముప్పు బారి న పడిన బాధిత కుటుంబాలకు డ్రోన్ సహాయంతో ఆహార పొట్లాలు, నిత్యా వసర వస్తువులు పంపిణీ చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో మంగళవారం డ్రోన్ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ఆసక్తికరంగా మారింది.
కడియపులంకమహాలక్ష్మి చింత దగ్గర చెక్కపల్లి వారి వీధిలో చెక్కప ల్లి వివేక్ అనే యువకుడు ఈ చిట్టి బాల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. అయితే పిల్లలు నెలకొల్పిన ఈ గణపతి విగ్రహాన్ని కోటిపల్లి కాలువలో నిమజ్జనం చేయడం ప్రమాదకరంగా భావించిన కుటుంబ పెద్దలు నర్సరీలలో పురుగుమందులు పిచికారికి వినియోగించే డ్రోన్ సహాయంతో నిమజ్జనం చేశారు. ఈ డ్రోన్ నిమజ్జనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com