Ayodhya and Varanasi : అయోధ్య, వారణాసిలో విపరీతమైన చలి.. తగ్గేదేలే అంటున్న భక్తులు

యూపీలోని పలుప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. ప్రఖ్యాత అయోధ్య, వారణాసీలో చలితీవ్రత పెరిగింది. చలిలోనే అయోధ్యలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. కోల్డ్ ఎఫెక్ట్ ఉన్నా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అటు అయోధ్య పరిసరాలను భారీగా పొగమంచు కప్పేసింది. టెంపరేచర్లు పదిలోపే నమాదు అవుతుండటంతో...స్థానికులు చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు. హర్యానాలోని పలుప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. మార్నింగ్ ఎనిమిది దాటినా...సరైన వెలుతురులేక పోవటంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎయిర్ పొల్యూషన్, పొగమంచుతో చండీఘర్ లో జనం ఇళ్ల నుంచి బయటకు రావటంలేదు. చలి వణికిస్తుండటంతో... స్థానికులు దుప్పట్లు, మప్లర్లు, జాకెట్లు ధరించి నిత్యవసర వస్తువుల కోసం ఇళ్లనుంచి బయటకు వస్తున్నారు. మధ్యాహ్నం టైంలో షాపింగ్ పాయింట్లు కళకళలాడుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com