TTD Vigilance : టీటీడీ ఈవో పేరుతో ఫేక్ అకౌంట్

టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఫేస్‌బుక్‌లో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ ఖాతాను సృష్టించి, భక్తులకు సందేశాలు పంపుతూ డబ్బులు కావాలని కోరుతున్నారని టీటీడీ దృష్టికి వచ్చింది. ఇది పూర్తిగా మోసగాళ్ల నకిలీ చర్యగా గుర్తించడం జరిగిందన్నారు. భక్తులు ఇటువంటి నకిలీ అకౌంట్లకు దూరంగా ఉండాలని, ఎవరికైనా ఇలాంటి సందేహాస్పద సందేశాలు వస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగానికి చెందిన సెల్ నెం: 9866898630. లేదా టీటీడీ టోల్ ఫ్రీ నెం: 18004254141 కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని కోరడమైనది. భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org లేదా సోషల్ మీడియా అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేయడమైనదని తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com