TTD Updates : తిరుమల వెళ్లే వాహనాలకు ఇకపై ఫాస్టాగ్ తప్పనిసరి

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. ఆగస్టు 15, 2025 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల కొండపైకి వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ లేని వాహనాలను అలిపిరి చెక్ పోస్ట్ వద్ద అనుమతించరు.ఫాస్టాగ్ లేని భక్తుల సౌకర్యార్థం, అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసీఐసీఐ బ్యాంక్ సహకారంతో ఫాస్టాగ్ జారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు టీటీడీ తెలిపింది. కాబట్టి, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకొనే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలందించడం దృష్ట్యా ఆగస్టు 15 నుంచి తిరుమల వచ్చే వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసినట్లు పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com