TTD : శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు

TTD : శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు
X

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపీ విరామ సమయంలో సినీ దర్శకుడు గోపిచంద్ మల్లినేని, సంగీత దర్శకుడు థమన్, సినీ కథానాయకుడు అశ్విన్ బాబులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలు సత్కరించారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని సుప్రీమ్ కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలు సత్కరించారు.

Tags

Next Story