Ganesh Chaturthi: గణేష్ చతుర్థి స్పెషల్: మహిమాన్వితుడు.. కాణిపాకం వినాయకుడు
Ganesh Chaturthi Special: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకంలోని గణపతి దేవాలయం గురించి తెలుసుకుందాం.. 11వ శతాబ్దం ప్రారంభంలో చోళ రాజు కులోత్తుంగ చోళుడు I చే స్థాపించబడింది. విజయనగర రాజవంశ చక్రవర్తులచే 1336లో మరింత మెరుగులుదిద్దుకుంది.
ముగ్గురు పురుషుల కథ: సుమారు 1000 సంవత్సరాల క్రితం కాణిపాక గ్రామంలో ముగ్గురు శారీరక వికలాంగ సోదరులు నివసించేవారు. సోదరుల్లో ఒకరు అంధులు కాగా, మరొకరు మూగ, మూడోవాడు చెవిటివాడు. వారు విహారపురి గ్రామానికి సమీపంలో ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ నిరాడంబరమైన జీవనాన్ని గడుపుతుండేవారు.
ఒక రోజున, సోదరులలో ఒకరు వేర్వేరు మార్గాల ద్వారా భూమికి సాగునీరు ఇస్తున్నప్పుడు, మిగిలిన ఇద్దరు పికోటా సిస్టమ్‌ను ఉపయోగించి బావి నుండి నీటిని తీస్తున్నారు. ఆ సమయంలోనే బావి ఎండిపోయిందని గుర్తిస్తారు. దీంతో ఒక సోదరుడు బావిలో దిగి, ఇనుప పలుగుతో బావిని మరింత లోతుగా త్రవ్వడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే తన పలుగు ఒక రాయిలాంటి వస్తువుకు తగలడాన్ని గుర్తిస్తాడు.
భూమి క్రింద నుండి ఏదో ఉద్భవించింది. రాతి నిర్మాణం నుండి రక్తం కారడాన్ని సోదరులు చూసి ఆశ్చర్యపోయారు. క్షణంలో రక్తం మొత్తం బావిలోని నీళ్లలో కలిసిపోయింది. ఇంతలోనే సోదరుల శారీరక లోపాలు మాయమయ్యాయి. ఈ వార్త గ్రామస్తుల చెవిన పడింది. వారంతా బావి వద్దకు చేరుకుని బావిని మరింత లోతుకు తవ్వేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే వారికి స్వయంభు గణేశుడి విగ్రహం కనిపించింది.
అఖండమైన దైవిక ఆవిష్కరణ
దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ విగ్రహానికి గ్రామస్థులు కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించారు. కొబ్బరి నీరు ఒకటిన్నర ఎకరాల కంటే ఎక్కువ దూరం వరకు ప్రవహించడం ప్రారంభించింది. అప్పటి నుండి ఆ ప్రాంతం "కాణిపాకం" అనే పేరుతో పిలవబడుతోంది. ఇక్కడ "కాని" అంటే చిత్తడి నేల మరియు "పాకం" అంటే నీరు ప్రవహించడం.
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుడు
ఈ రోజు వరకు, విగ్రహం ఉద్భవించిన బావిలోనే ఉంది. పవిత్ర బావిలోని నీరు ఎప్పుడూ ఎండిపోదు.
నమ్మశక్యం కాని వాస్తవాలు
1. కాణిపాకంలోని వినాయకుని దివ్య చిత్రం గురించి నమ్మలేని నిజం ఏమిటంటే, ఈ విగ్రహం కాలక్రమేణా పరిమాణంలో పెరుగుతోందని నివేదించబడింది. ప్రస్తుతం విగ్రహానికి మోకాళ్లు, పొట్ట మాత్రమే కనిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనం యాభై ఏళ్ల క్రితం స్వామివారికి ఒక భక్తుడు చేయించిన వెండి కవచం ఇప్పటి విగ్రహానికి సరిపోదు.
2. కాణిపాకంలోని గణపతి స్వయం ప్రతిరూపం. ఆసక్తికర విషయం ఏమిటంటే ఆలయపరిసరాల్లోని జలంలో స్నానమాచరించి వచ్చి ప్రదక్షిణ చేసిన కుటుంబంలో కలహాలు ఉంటే తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.
గణేశ చతుర్థి రోజు నుండి ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం అనేక మంది యాత్రికులతో కళకళలాడుతూ ఉంటుంది. 20 రోజుల పండుగను ఆలయ అధికారులు మరియు భక్తులు చాలా కోలాహలంగా జరుపుకుంటారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com