TTD : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ .. టికెట్లు విడుదల

TTD : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ .. టికెట్లు విడుదల
X

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్‌ను అందుబాటులో ఉంచనుంది. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 5 గంటలు పడుతోంది. ఇక, నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 56,225లుగా ఉండగా.. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 19,588. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 3.95 కోట్లుగా ఉంది.

తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్‌ 30 నుంచి నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు గురువారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టిని నిర్వహించారు.

Tags

Next Story