శబరిమల వెళ్లే మహిళలకు గుడ్‌న్యూస్

శబరిమల వెళ్లే మహిళల భద్రత పట్ల కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంబా బేస్‌లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది. ఈ వసతి గృహంలో 50మంది మహిళలు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేసి సోమవారం ప్రారంభించింది. అయ్యప్ప మాలధారులతో వచ్చే మహిళలు తమవారు తిరిగొచ్చే వరకు పంపా బేస్, హిల్ టాప్ వద్ద వాహనాల్లోనే ఎదురు చూడాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో మహిళలకు ఆ కష్టాలు తీరనున్నాయి.
శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్. భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే పలు రైళ్లు నడుపుతోన్న దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా జనవరి మాసంలో ప్రత్యేకంగా 34 అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్ - కొట్టాయం; కొట్టాయం - సికింద్రాబాద్; మౌలాలి - కొట్టాయం; కాచిగూడ - కొట్టాయం; మౌలాలి - కొల్లం మధ్య జనవరి 3 నుంచి ఫిబ్రవరి 1వరకు ఈ ప్రత్యేక రైళ్లు సర్వీసులందించనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com