Pithapuram : పవన్ అడ్డా పిఠాపురంలో శివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు

Pithapuram : పవన్ అడ్డా పిఠాపురంలో శివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు
X

కాకినాడ జిల్లా పిఠాపురంలో శివరాత్రి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సొంత నియోజకవర్గం కావడంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పాద గయ, శక్తి పీఠం, కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలకు అధికారులు చర్యలు చేపట్టారు. దక్షిణ కాశిగా పాద గయకు పేరుంది. పాద గయ దేశంలోనే చారిత్రక పుణ్యక్షేత్రం. గయాసురుడు అనే రాక్షసుని సంహారం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చేసిన తపస్సు, పరమశివుడు రాక్షస సంహారం కోసం కోడి రూపంలో అవతరించడం ఇక్కడ స్థల పురాణం. ఇంతటి చరిత్ర ఉన్న పాద గయ మహా శివరాత్రికి రెండు లక్షల మందికిపైగా భక్తులు వస్తారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రెండుసార్లు అధికారులు ఏర్పాట్లపై రివ్యూ చేశారు.

Tags

Next Story