Nagula Chaviti : ఘనంగా నాగుల చవిత వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి పండుగ వేడుకలు జరుగుతున్నాయి.. మహిళలు వేకువజామునే పుట్టలలో పాలు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు. కార్తీక శుద్ధ చతుర్థి రోజుని నాగుల చవితి రావడం భక్తి శ్రద్ధలతో నాగుల చవితి జరుపుకుంటున్నారు... భక్తులు పాము పుట్టలో పాలు పోయడానికి బారులు తీరారు. పల్లె, పట్నాలు తేడా లేకుండా భక్తులు నాగుల చవితి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు... కొంతమందిని భక్తులు పిల్లలకి చెవులు కుట్టించుకోవడం కూడా జరుగుతోంది...
అటు కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నాగుల చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున రెండున్న గంటల నిమిషాలకు స్వామివారి పుట్టలో పాలుపోసి స్వామివారిని మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నాగుల చవితి సందర్భంగా ఆలయంలో నిర్వహించే ప్రత్యేక దర్శనాలను ఆలయ అధికారులు రద్దు చేశారు. స్వామివారిని దర్శించేందుకు సుమారు 50 వేల నుంచి లక్ష మంది భక్తులు వరకు రావచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో కొన్ని దశాబ్దాలుగా చెట్టుకింద పాముల పుట్ట ఉంది. దీంతో.. కలెక్టర్ ఛాంబర్ కు జనం క్యూకట్టారు. ఏటా నాగుల చవితికి నగరంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఈ పుట్టకు పూజలు చేస్తారు. పుట్టలో పాలు పోసి, కోడిగుడ్లు పెడతారు. బాణసంచా కాలుస్తారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ కోలాహలం ఇలాగే ఉంటుంది. అధికారులు కూడా ఇక్కడికి వచ్చి నాగ రాజుకు పూజలు చేసి వెళ్తారు. దీంతో కలెక్టరేట్ కాస్తా తాత్కాలికంగా సుబ్రహ్మణ్యస్వామి ఆలయంగా మారిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com