TTD : తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవ వైభవం.. ఇవాళ్టినుంచే

TTD : తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవ వైభవం.. ఇవాళ్టినుంచే
X

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరగనుంది. సాయంత్రం ఆలయంలో సేనాధిపతిని సుందరంగా అలంకరించి విశేష సమర్పణ కావిస్తా రు. అనంతరం రాత్రి 7 గంటలకు మాడవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తా రు. తర్వాత రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. యాగశాలలో అర్చక స్వాములు కైంకర్యాలు నిర్వహించి అంకురార్పణ నిర్వహిస్తా రు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. శుక్రవారం సా యంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు, రేపు రాత్రి నుంచి స్వామి వారికి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి పెద్దశేష వాహనంపై స్వామి వారు విహరిస్తారు.

Tags

Next Story