Tirumala : తిరుమలలో వైభవంగా గురుపౌర్ణమి గరుడ సేవ

Tirumala : తిరుమలలో వైభవంగా గురుపౌర్ణమి గరుడ సేవ
X

తిరుమలలో గురుపౌర్ణమిని పురస్కరించుకుని గురువారం రాత్రి గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల సమయంలో సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవలో టీటీడీ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో వాహన సేవను వీక్షించి తరించారు. గరుడ సేవ అనేది తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన సేవల్లో ఒకటి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు రాత్రి జరిగే గరుడ సేవకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. పౌర్ణమి పర్వదినాల్లో కూడా ఈ సేవను నిర్వహించడం ఆనవాయితీ.

Tags

Next Story