Kondagattu : కొండగట్టులో హనుమాన్ జయంతి శోభ

Kondagattu : కొండగట్టులో హనుమాన్ జయంతి శోభ
X

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ప్రారంభమైన ఈ వేడుకలు గురువారం వరకు కొనసాగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. జయంతి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. భద్రాచలం నుంచి శ్రీరాముని పట్టు వస్త్రాలు కొండగట్టుకు రాగా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వస్త్రాలు సమర్పించారు. భారీగా భక్తుల రాకను గుర్తించిన ఆలయ అధికారులు నాలుగున్నర లక్షల లడ్డూలను సిద్ధం చేశారు.

Tags

Next Story