తిరుమలలో భారీగా కురిసిన వర్షం

By - TV5 Digital Team |23 April 2021 10:45 AM GMT
తిరుమలలో భారీ వర్షం కురిసింది. దాదాపు మూడు గంటలపాటు ఎడతెరపి లేకుండా కుండపోత వర్షం పడింది. దీంతో దైవ దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
తిరుమలలో భారీ వర్షం కురిసింది. దాదాపు మూడు గంటలపాటు ఎడతెరపి లేకుండా కుండపోత వర్షం పడింది. దీంతో దైవ దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శ్రీవారి దర్శనానికి వైకుంఠ కాంప్లెక్స్ కు వెళ్లే భక్తులతోపాటు దర్శనం చేసుకొని వచ్చిన భక్తులు సైతం తడిసిపోయారు. శ్రీవారి ఆలయ పరిసరాలు.. మాఢవీధులు, లడ్డూ వితరణ కేంద్రాల్లో వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో నీటిని బయటకు పంపే చర్యలను సిబ్బంది చేపట్టారు. వర్షం కారణంగా ఘాట్ రోడ్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో మొదటి, రెండవ ఘాట్ రోడ్డులలో ప్రయాణించే వారిని అధికారులు అప్రమత్తం చేశారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com