Maha Shivaratri : మహా శివరాత్రికి ఆ పేరెలా వచ్చిందంటే?

ఈ సృష్టికి లయకారకుడైన పరమశివుడు లింగంగా ఆవిర్భవించిన రోజే మహా శివరాత్రి. మాఘమాసం బహుళ చతుర్ధశి రోజున ఆ ముక్కంటి శివలింగంగా ఆవిర్భవిస్తాడు. అయితే పురాణాల ప్రకారం శివరాత్రికి మరో కారణం కూడా ఉంది. క్షీరసాగర మథనం సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ బయటికి వచ్చే విషాన్ని పరమేశ్వరుడు తన గరళంలో నింపుకొని ముల్లోకాలను కాపాడుతాడు. ఇలా చేసిన ఆ కాళరాత్రే శివరాత్రి అని ప్రతీతి.
విష్ణువు, బ్రహ్మ మధ్య ఎవరుగొప్ప అనే వివాదం తలెత్తుతుంది. అప్పుడు శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, లింగానికి ఆది, అంతాలను కనిపెట్టిన వారే గొప్పవారని చెబుతాడు. విష్ణువు మహాలింగం మూలం కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. బ్రహ్మ ఆది తెలుసుకోవాలని చూసి విఫలమవుతాడు. అయితే తాను ఆది కనుగొన్నట్లు మొగలిపువ్వు, గోవుతో శివుడికి అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు. అది తెలిసి బ్రహ్మ, మొగలిపువ్వు, గోవును శివుడు శపిస్తాడు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com