Tirumala : తిరుమల శ్రీవారికి భారీ కానుక...రెండున్నర కిలోల బంగారంతో...

కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు తమ కానుకలను చెల్లించుకుంటారు. తమకు తోచినంత శ్రీవారి హుండీ లో వెయ్యడం ఆనవాయితీ. కొందరు భక్తులు శ్రీవారి ట్రస్టు కు భారీ మొత్తంలో విరాళాలు ఇస్తుండగా మరి కొందరు అలంకార ప్రియుడైన తిరుమలేశునికి ఆభరణాలు సమర్పిస్తుంటారు.
కాగా చెన్నై కి చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైసెస్ అనే సంస్థ తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుకలు సమర్పించింది. 2.5 కిలోల బంగారంతో చేసిన శంకు చక్రాలను ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారికి అందించారు. ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి వీటిని అందుకున్నారు. ఈ శంకు చక్రాల విలువ సుమారు రూ. 2.4 కోట్లు ఉంటుందని అంచనా.
అనంతరం ఏఈఓ వెంకయ్య చౌదరి దాతల్ని శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి చెన్నై భక్తులు అందించిన బంగారు శంఖం, చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2.5 కిలోల బంగారంతో తయారుచేసిన ఈ ఆభరణాలను ప్రత్యేక సందర్భాలలో స్వామివారికి అలంకరించనున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com