TTD : తిరుమలలో మళ్లీ పెరిగిన రద్దీ

TTD : తిరుమలలో మళ్లీ పెరిగిన రద్దీ
X

వరుస సెలవులు, పండుగ కావడంతో.. తిరుమలకు భక్తులు బారులు తీరారు. తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ భారీగా పెరిగింది. స్వామిని దర్శించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 18 గంటలకుపైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటలకుపైగానే సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిక్కిరిపోయాయి. టీబీసీ కౌంటర్ వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. దీపావళి రోజు గురువారం స్వామి వారిని 63 వేల 987 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.66 కోట్ల రూపాయలు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు.

Tags

Next Story