మహాచండిగా కనకదుర్గమ్మ.. స్కందమాతగా భ్రమరాంబిక

మహాచండిగా కనకదుర్గమ్మ.. స్కందమాతగా భ్రమరాంబిక
X

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. రోజుకో అలంకా రంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇవాల్టికి ఒక విశిష్టత ఉంది. ప్రతి ఏటా ఐదవరోజున స్వర్ణకవచాలంకృత దుర్గ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చేవారు. గత ఏడాది నుంచి చండి అలంకారానికి మార్చింది వైదిక కమిటీ. ఆ ఏడాది అధిక శ్రవణం, తిథిలో హెచ్చుతగ్గుల తేడా రావటంతో అమ్మవారి అలంకారాల్లో కూడా మార్పులు చేశారు. ఈ మధ్యకాలంలో ఇంద్రకీలాద్రిపై నిత్యం చండీ హోమాలు జరుగుతుండటంతో.. అమ్మవా రికి చండీ అలంకారం వేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. దీంతో ఇవాళ మహాచండిగా దర్శనమిస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మహాచండీ దేవిగా దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీశైల మహాక్షేత్రంలోనూ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ భ్రమరాంబికాదేవి స్కంద మాతగా భక్తులను అనుగ్రహిస్తున్నా రు. స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు.

Tags

Next Story