TG : వేములవాడలో కార్తీక రద్దీ.. బెజవాడలో మాజీ రాష్ట్రపతి
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి శుక్రవారం కావడంతో.. భక్తులు భారీఎత్తున ఆలయానికి చేరుకుని ఆలయ కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుని, ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. స్వామివారి దర్శనానికి రెండు గంటలకు సమయం పడుతోంది. ఆలయం ముందు భాగంలో దీపాలను వెలిగించారు భక్తులు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మ వారి ఆశీస్సులు దేశ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com