TTD : 17న తిరుమలలో కార్తీక వనభోజనం

TTD : 17న తిరుమలలో కార్తీక వనభోజనం
X

కార్తీక వనభోజన కార్యక్రమం ఈనెల 17న (ఆదివారం) తిరుమలలోని గోగర్భం డ్యామ్ సమీపంలో గల పార్వేట మండపంలో జరగనుంది. ఉదయం 8.30 గంటలకు శ్రీమలయప్పస్వామివారు చిన్న గజ వాహనంపై శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పల్లకిపై ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి ఉదయం 10 గంటలకు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితరత సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్తీక వనభోజన కార్యక్రమాల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

Tags

Next Story