Kartika Shobha : కార్తీక శోభ .. రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

కార్తికమాసం చివరి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. దక్షిణకాశీగా పేరుగాం చిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దర్శ నానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. తెల్లవారుజామున నుండి వేలాది మంది భక్తుల రద్దీతో కిటకిటలాడింది. రాజన్న దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. కార్తిక మాసం మొదలు నుంచి ఇప్పటివరకు 12 లక్షల మంది పైగా స్వామివారిని దర్శించుకున్నట్లుగా ఆలయ ఈవో తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత, అన్న పూజల సేవలు రద్దు చేశారు. దర్శగుండలంలో పవిత్రస్నానాలు చేసి, ఆలయ ప్రాంగణంలో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. స్వామి వారికి కోడె మొక్కుల పూజలు చెల్లించుకుంటున్నారు. కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా భద్రాచలం గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి, కార్తిక దీపాలను గోదావరిలో వదులుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో కార్తీక శోభ సంతరిం చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీ కాళే శ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారి అభిషేకాలు, విశేష పూజలు చేసి టెంపుల్ వద్ద దీపాలు వెలిగిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com