Kedarnath : కేదార్‌నాథ్ బంగారం మాయం కాంగ్రెస్ అజెండా.. కోర్టుకు వెళ్లొచ్చు

కేదార్ నాథ్ దేవాలయంలో వందల కిలోల బంగారం మాయమైందన్న ఆరోపణలపై ఆలయ కమిటీ బుధవారం స్పందించింది. బద్రీనాద్- కేధార్నాద్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ దీనిపై స్పందించారు. "228 కిలోల బంగారం మాయమైందని స్వామి అవిముక్తేశ్వ రానంద ప్రకటనలు చేయడం చాలా దురదృష్టకరం. నేను ఆయన్ను అభ్యర్థిస్తున్నా.. సవాలు కూడా చేస్తున్నా. వాస్తవాలను ప్రపంచం ముందుంచాలని కోరుతున్నా. స్వామీజీ ప్రకటనలు చేసే కంటే.. సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసి దర్యాప్తునకు డిమాండ్ చేయాల్సింది. అంతేకాదు.. ఆయన వద్ద ఆధారాలు ఉంటే హైకోర్టు లేదా సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు" అని బద్రీనాద్- కేధార్నాద్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు.
ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే హక్కు ఆయనకు లేదన్నారు. కేవలం ఆందోళనలు, వివాదాలు సృష్టించడానికే ఇలా చేస్తున్నా. రని పేర్కొన్నారు. కాంగ్రెస్ అజెండా ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేయడం విచారకరమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com