TTD : తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

TTD : తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల నాలుగో తేది నుంచి జరగనున్న నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడాదిలో నాలుగు సార్లు ఆలయ శుద్ధి కార్యక్రమం చేస్తారు దీనినే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉపాలయాలు , ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. శుద్ధి అనంతరం పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

Tags

Next Story