TTD : వైకుంఠ ఏకాదశి వేళ తిరుమలలో లక్షలాది లడ్డూలు రెడీ

TTD : వైకుంఠ ఏకాదశి వేళ తిరుమలలో లక్షలాది లడ్డూలు రెడీ
X

తిరుమలకు వైకుంఠ ఏకాదశి వేళ వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రంలో అన్ని కౌంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతారు. అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ గా ఉంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రతా ఏర్పాట్లకు టీటీడీ ఈవో ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటుచేశారు. చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగు నీరు, టీ, కాఫీ, పాలు, స్నాక్స్ పంపిణీ చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ లు ఏర్పాటు చేశారు. పార్కింగ్ వద్ద నుండి క్యూలైన్ వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సులు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుంచి 1.20 లక్షల టోకెన్లు చేస్తారు. తర్వాత ఏ రోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తారు.

Tags

Next Story