Tirumala : తిరుమల శ్రీవారి సేవలో నాగ చైతన్య దంపతులు

Tirumala : తిరుమల శ్రీవారి సేవలో నాగ చైతన్య దంపతులు
X

తిరుమల శ్రీవారిని పలువురు సిని ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో నూతన జంట నాగ చైతన్య,శోభిత., త్రివిక్రమ్ శ్రీనివాస్ లు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల నాగచైతన్య, శోభిత లను చూసేందుకు... సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనం (సాధారణ దర్శనం) కోసం భక్తులకు దాదాపు 15 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.ఆగస్టు 20న శ్రీవారిని 75,688 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.30 కోట్లుగా నమోదైంది. 29,099 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

Tags

Next Story