TTD : దర్శనం టోకెన్స్, టికెట్లు ఉంటేనే తిరుమల రండి.. రద్దీ అలర్ట్

TTD : దర్శనం టోకెన్స్, టికెట్లు ఉంటేనే తిరుమల రండి.. రద్దీ అలర్ట్
X

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతోంది. భక్తులు క్యూ లైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ అధికారులు జారీ చేస్తున్న సర్వదర్శనం టోకెన్స్ కోటా పూర్తి అయింది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి వుంచే ఈ నెల 19వ తేదీ వరకు సంబంధించిన టోకెన్స్ కోటాని అధికారులు జారీ చేశారు.

ఈ నెల 21వ తేదీ నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్స్‌ని ఏ రోజుకు ఆ రోజూ జారీ చేయనున్నారు. దర్శనం టికెట్స్, టోకెన్స్ వున్న వారిని మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ అధికారులు అనుమతిస్తుండడంతో.. దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు తమ తిరుమల పర్యటన ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా ఏడు రోజుల్లో నాలుగు లక్షల 75 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం వేకువజాము నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. గురువారం అర్ధరాత్రి 12.05 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు ధనుర్మాస కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శుక్రవారం వేకువజామున 3.50 గంటల నుంచి ఉదయం 8.15 గంటల వరకు వీఐపీలకు వైకుంఠద్వార దర్శనాలు కొనసాగాయి. ఆ తర్వాత సర్వదర్శన భక్తులను అనుమతించారు. స్లాట్లవారీగా అర్థరాత్రి వరకు వైకుంఠద్వార దర్శనాలను కల్పిస్తున్నారు.

Tags

Next Story