Tiruchanur : ముత్యపు పందిరిపై పద్మావతమ్మ

Tiruchanur : ముత్యపు పందిరిపై పద్మావతమ్మ
X

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ఇవాళ ఉదయం ముత్యపుపం దిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పద్మావతీదేవి ఆదిలక్ష్మి అలంకారంలో ముత్యపు పందిరి వాహనంపై తిరు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి చాటి చెప్పేందుకే అమ్మవారు ఈ వాహనంపై ఊరేగుతారని అర్చకులు చెబుతున్నారు. ముత్యపు పందిరి వాహనంపై ఊరేగే పద్మావతి అమ్మవా రిని దర్శించడం పూర్వ జన్మ సుకృతమని వేంకటాచల మహత్యంలో ఉంది.

Tags

Next Story