Tirumala Brahmotsavam : తిరుమల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లను ప్రారంభించింది. అక్టోబర్ 4 నుంచి 12వరకు 9 రోజుల పాటు దేవదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనుండడంతో తిరుమలలో చేయాల్సిన ఏర్పాట్లను రెండు నెలల ముందు నుంచే ప్రారంభించారు. వచ్చేనెల 4 వ తేది నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో మహా సంరంభానికి అప్పుడే సందడి మొదలైంది.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఇంకా మెరుగైన ఏర్పాట్లు చేసేవిధంగా టీటీడీ ప్రణాళికలు సిద్దం చేసుకుని ఆ మేరకు ఏర్పాట్లను ప్రారంభించింది. శ్రీవారి వాహన సేవలు జరిగే ఆలయ మాడవీ ధులలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాలరీల నుంచే వాహన సేవలు తిలకించేలా ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్టోబర్ 4న శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వచ్చేనెల 3 వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరగనుంది. ఉత్సవాలకు ప్రారంభసూచికగా అక్టోబర్ 3 వ తేది సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరనున్నది. ఇప్పటికే బ్రహ్మోత్సవాల నిర్వహణ పై టీటీడీ ఈవో, పోలీసులు, టిటిడిలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించగా త్వరలో కలెక్టర్తో పాటు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com