TTD : తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లు.. టీటీడీ కీలక నిర్ణయం

రేపు రథ సప్తమి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అష్టాదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు, ఊంజల్ సేవల్ని టీటీడీ రద్దు చేసింది. అటు ఎన్ఆర్ఐలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు కేటాయించే ప్రత్యేక దర్శనాలను, నేటి నుంచి 3రోజుల వరకూ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసింది. నేడు సిఫార్సు లేఖల్ని స్వీకరించబోమని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇకపై ప్రతి నెలా చివరి మంగళవారం సమావేశం కావాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన చర్యలు సహా ఇతర అంశాలపై వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేలా ఈ ఆలోచన చేశారు. దీనికి తగ్గట్టుగా ప్రతినెలా అజెండాను సిద్ధం చేసి బోర్డు ముందు ఉంచాలని అధికారులను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. రథసప్తమి సందర్భంగా 3, 4, 5 తేదీల్లో SSD టోకెన్స్ జారీ చేయట్లేదని పేర్కొంది. భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనానికి వెళ్లగలరని తెలిపింది. దీంతో పాటు రథసప్తమి నాడు సిఫార్సుల దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com