Srisailam : శ్రీశైలంలో రావణ వాహన సేవ

Srisailam : శ్రీశైలంలో రావణ వాహన సేవ
X

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు రావణ వాహనసేవ నిర్వహించారు. ఈ సేవలో స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో కన్నులపండువగా గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్క భజన, రాజభటుల వేషాలు, కేరళ చండీ మేళం, కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, చెంచు నృత్యం తదితర కళారూపాలు గ్రామోత్సవంలో భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Tags

Next Story