TTD : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా దర్శనం

TTD : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా దర్శనం
X

తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం శ్రీవారిని దర్శనానికి జనం చాలా తక్కువ సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక 300 రూపాయలు ప్రత్యేక దర్శనం టోకెన్ తీసుకున్న వారు దర్శనానికి వేచి చూడాల్సిన పని లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లో భక్తులు ఎవరూ లేకపోవడంతో టీటీడీ అధికారులు నేరుగా దర్శనానికి పంపుతున్నారు. మంగళవారం స్వామి వారిని 59వేల 140 మంది భక్తులు దర్శించుకున్నారు. 16వేల 937 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్ల రూపాయలు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Tags

Next Story